హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం

KMR: రాజేష్‌ చంద్ర ఆదేశాల మేరకు ఇవాళ లేబర్‌ అడ్డాలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్ డ్రైవింగ్‌ చేయవద్దని సూచించారు.హెల్మెట్‌ ధరించాలని, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. సైబర్‌ మోసాలకు 1930, అత్యవసర సమయంలో 100/112కు కాల్‌ చేయాలన్నారు.