JN: కూనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్‌తో పాటు 24 గంటల వైద్య సేవలు, ఎక్స్‌రే తదితర సౌకర్యాలు కల్పించాలని BJP జాఫర్‌ఘడ్ మండల అధ్యక్షుడు నాగేష్ గౌడ్ కోరారు. విషజ్వరాల నేపథ్యంలో పీహెచ్‌సీని సందర్శించి సమస్యలను పరిశీలించారు. 10-12 వేల మందికి సేవలందిస్తున్న ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందన్నారు. అనంతరం వైద్యులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'కూనూరు పీహెచ్‌సీలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలి'


