హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైనిక్ స్కూల్ సీటుతో విద్యార్థిని ఘనత

SRCL: కోనరావుపేట మండలం కనగర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని గాజుల వర్షిణి ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో సీటు సాధించింది. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లిగ్రామానికి చెందిన వర్షిణి, అమ్మమ్మ ఊరైన కనగర్తిలో ఉంటూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె విజయంపై లింగంపల్లి, కనగర్తి గ్రామస్తులు హర్షంవ్యక్తం చేయగా, ప్రధానోపాధ్యాయలు అభినందించారు.