హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసు నిందితుడు ఆత్మహత్య

KMM: ముదిగొండ మండల కేంద్రానికి చెందిన మెట్టెల వినయ్ అనే యువకుడు సుమారు 5 నెలల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన వినయ్ గత రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ముదిగొండ పోలీసులు ఆరా తీస్తున్నారు.