హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం

SRD: పటాన్‌చెరు గాంధీ థీమ్ పార్క్ సర్కిల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ఈ ఏడాది సుమారు 600 మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు.