హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు శనివారం మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ సిద్ధాంతాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.