BHNG: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సమస్యల పరిష్కార సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గౌరవ వేతనం రూ.6,500 నుంచి రూ.25 వేలకు పెంచాలని, గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు నారాయణ స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
'సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి'


