గద్వాల జిల్లాలో సాగవుతున్న పత్తి పంటపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటడంతో పాటు రాత్రివేళ వేడి పెరుగుతోంది. అయిజ, ఇటిక్యాల, మానవపాడు ప్రాంతాల్లో రసంపీల్చే పురుగులు, జాసీడ్స్ దాడితో ఆకులు ఎర్రబడి రాలుతున్నాయని రైతులు తెలిపారు. పంట రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
గద్వాలలో పత్తి పంటకు తీవ్ర ఇబ్బందులు


