SDPT: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 18, 20వ వార్డుల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చన్నారు.
తెలంగాణ
'ప్రతి ఇంటా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి'


