హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD, బెంగళూరు హైవేపై 28 డేంజర్ జోన్లు..!

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై 28 ప్రమాదకర బ్లాక్‌ స్పాట్లను NHAI గుర్తించింది. తరచూ ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతాల్లో వంతెనలు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. వాహనదారుల భద్రత కోసం బ్లాక్‌ స్పాట్ల వద్ద రహదారి డిజైన్‌, సూచికలు, ఇతర భద్రతా చర్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.