హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాములు వారి నిత్య కళ్యాణం

భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక శనివారం నేత్రపర్వంగా సాగింది. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు క్రతువును వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.