హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాప్‌పై ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు

MDK: చిన్నశంకరంపేట మండలంలోని ఎస్.కొండాపూర్‌లో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్‌పై దాడి చేశారు. పక్కా సమాచారంతో గ్రామానికి చెందిన మూదరాజు వద్ద నుంచి 6.66 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.