సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగంపేటలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. గతంలో నీళ్లు బాగానే వచ్చేవని, ఇప్పుడు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
నీటి కోసం రోడ్డెక్కిన లింగంపేట మహిళలు


