హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ, కలెక్టర్

WGL: వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి, ఉర్సు చెరువుల వద్ద వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, సత్య శారద కలిసి శనివారం పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.