హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ASF: ఆసిఫాబాద్ మండలంలోని కొమురం భీం ప్రాజెక్టు వద్ద ఇవాళ భారీ వర్షం కురుస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 238 మీటర్లు, నీటి నిల్వ 6.001 TMCలుగా ఉంది. 250 క్యూసెక్కుల ఇన్ఫ్ల వస్తుండగా, ప్రస్తుతం ఔట్లో లేదు. వర్షం నిరంతరంగా కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.