హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామతీర్థం చెక్ డ్యాంకు జలకళ

SRD:కంగ్టి మండలం రామతీర్థం శివారులోని చెక్ డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దీంతో శనివారం నిండుకుండలా జలకళను సంతరించుకుంది. ఈ ఏడాదిలో వర్షాలు పుష్కలంగా కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి జలాలు ప్రవహిస్తూ చెక్ డ్యాం ద్వారా దిగువకు నల్లవాగు ప్రాజెక్టు లోకి జలాలు కలుస్తున్నాయి. ఈ చెక్ డాం వల్ల ఇక్కడ ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు పెరిగినట్లు రైతులు తెలిపారు.