హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీ ముట్టడికి యత్నం.. BJYM నేత అరెస్ట్

SRCL: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ABVP అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు తంగళ్లపల్లి పోలీసులు BJYM జిల్లా నాయకుడు సమానపెల్లి ప్రశాంత్‌ను ఇంటివద్ద అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రూ. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.