హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక అక్రమ రవాణాపై ఆరోపణలు

MBNR: మిడ్జిల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.