హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో!

SRPT: నాణ్యమైన 12 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సూర్యాపేట-జనగాం రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు బైఠాయించారు. సూర్యాపేట మండలం యార్కారం సబ్ స్టేషన్ ఎదుట చేపట్టిన ఈ నిరసనతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.