హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌.. వాహనాలు సీజ్‌

MHBD: మరిపెడ మండలం గుర్రప్ప తండాలో శనివారం పోలీసులు కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని రెండు కార్లు, 15 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.