NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా తేమ, ఆర్ద్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. 7 రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి, చిరుజల్లులు మాత్రమే కురవడంతో రైతులు దిగులుగా ఉన్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాకు మోస్తరు వర్ష సూచన!


