హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ రోడ్డులో ప్రయాణించేదేలా..?

SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో పైపులైన్ లీకేజీ నీరు రోడ్డుపై పారడంతో రహదారి ధ్వంసమవుతోంది. నిత్యం ఈ మార్గంలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో గుంతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.