హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పితే అంతే సంగతి..!

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోడ్లపై నిత్యం రద్దీగా ఉంటాయి. హైదరాబాద్ వెళ్లే రహదారిపై మోపెడ్‌పై చంకన బిడ్డను ఎత్తుకున్న మహిళ వెనుక కూర్చొని, పైపులైన్ చుట్టను మధ్యలో ఇరికించుకుని ప్రయాణించింది. రద్దీ రహదారిపై ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమాత్రం అదుపుతప్పినా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.