హైదరాబాద్: 28°C
తెలంగాణ

మియాపూర్‌లో పర్యావరణ చైతన్య యాత్ర

RR: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మియాపూర్ కాలనీవాసులు వినూత్న అవగాహన యాత్ర చేపట్టారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు కలుషితమవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మన భక్తి ప్రకృతికి హాని కలిగించకూడదని, చెరువులను, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.