ఖమ్మం: మధిర రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు లోకో పైలట్ స్టేషన్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే జీఆర్‌పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


