హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ యార్డుకు రూ. 2.96 కోట్ల నిధులు

JGL: కథలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 2.96 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో 2,500 మెట్రిక్ టన్నుల గోదాం, పబ్లిక్ టాయిలెట్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధుల మంజూరుపై మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.