హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ప్రత్యేక రైలు

PPM: ప్రయాణికుల రద్దీని దృశ్యా విశాఖ–పార్వతీపురం మధ్య (07268/67) ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వో వై. బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి 12.25 గంటలకు పార్వతీపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 12.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.