విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో రూ.24 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి ఐ.వాణి తెలిపారు. ఇందులో 12 వెంటిలేటర్ పడకలు, ఐసీయూ, ఇంటర్మీడియెట్ కేర్, సాధారణ వార్డులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు సీసీబీని ప్రారంభించనున్న మంత్రి


