GDWL: వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసు శాఖ నిబంధనలు పాటించాలని మల్దకల్ ఎస్సై కొండా శ్రీహరి సూచించారు. పోలీస్ వెబ్‌సైట్ ద్వారా ముందస్తు అనుమతి పొంది, ఆ పత్రాలను స్థానిక ఠాణాలో సమర్పించాలని స్పష్టం చేశారు. అధిక శబ్దాలు చేసే డీజేలతో ప్రజలకు, రోగులకు ఇబ్బందులు కలిగిస్తే నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై


