GNTR: పొన్నూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి(45) దారుణ హత్యకు గురైంది. కన్నకూతురు పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి తల్లిని గొంతు నులిమి చంపేసింది. కుటుంబ కలహాల వల్లే వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని మృతురాలి బంధువులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన కూతురు


