హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురాతన ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: రాచర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ముందుగా గ్రామంలోని పురాతన శివాలయంలో స్వామివారిని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.