హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

KMR: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక, ప్రొటోకాల్‌ సీటింగ్, జాతీయ పతాకావిష్కరణ, బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.