హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ వైఫల్యంతో యువతి బలవన్మరణం

ELR: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఏలూరు కొత్తపేటకు చెందిన యువతి (21) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుండుగొలనులోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో హెచ్ఐర్ విభాగంలో ఆమె పనిచేస్తోంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.