E.G: పెనుగొండ గ్రామపంచాయతీ సమీపంలోని పార్కులో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించకుండా అక్కడే దహనం చేస్తున్నారని వాకర్లు ఆరోపించారు. పచ్చికపై డీజిల్ పోసి చెత్తను కాల్చడంపై వారు అభ్యంతరం తెలిపారు. పార్కును శుభ్రం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగొండ పార్కులో చెత్త కుప్పలు


