హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిన్‌లాండ్‌ పర్యటనకు ఇద్దరు ఉపాధ్యాయుల ఎంపిక

NZB: టీచర్స్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో భాగంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్‌లాండ్‌ పర్యటనకు రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల నుంచి జైతపూర్‌ ZPHS హెచ్‌ఎం పి. మమత, మోతె ZPHS హెచ్‌ఎం సిహెచ్. కృష్ణ ప్రసాద్‌ ఎంపికయ్యారు. ఆధునిక బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణపై అవగాహన పొందడం పర్యటన ముఖ్య ఉద్దేశం.