హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించండి: ఎస్పీ

NLG: జిల్లాలో సైబర్ నేరాలపై పోలీస్ కార్యాలయంలో నిన్న నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లడుతూ.. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిని పరిష్కరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శివరాం రెడ్డి, శ్రీనివాస్‌రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.