MBNR: కోయిలకొండ మండలం అంకీళ్ల శివారులో ఎన్నో ఏళ్ల కిందట వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. ఒకవైపు రక్షణ దిమ్మెలు కూలిపోయాయి. ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగాయి. ఇక్కడి నుంచి అయ్యవారి పల్లి, చందాపూర్, కోయిలసాగర్, ధన్వాడ గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ దిమ్మెలు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో వంతెన.. పట్టించుకోని అధికారులు


