హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫైళ్ల క్లియరెన్స్‌లో అలసత్వం'

అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగం పనితీరుపై సీఎం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, సేవల్లో 70.9 శాతం సానుకూలత నమోదైనట్లు వెల్లడైంది. వీధిదీపాలు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్య సేవల్లో తగ్గుదల కనిపించింది. ఫైళ్ల క్లియరెన్స్ లో అలసత్వం ఉన్నట్లు వెల్లడయ్యింది. క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.