WG: VRAల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న రాష్ట్రస్థాయిలో నిరసన దీక్ష నిర్వహించనున్నారు. 18న CCLAకు సామూహిక రాయబారం నిర్వహించనున్నట్లు AP గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలు, అదనపు డ్యూటీలతో వీఆర్ఎలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వీఆర్ఏల సమస్యలపై నిరసనకు సిద్ధం'


