TPT: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఇందిరానగర్‌కు చెందిన బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని రోషన్ (19) నమ్మించాడు. అనంతరం ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెస్ట్ సీఐ రామకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్


