హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు

JGL: జగిత్యాల కలెక్టరేట్‌లో వినాయక చవితిని పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్టించాలని ఆమె సూచించారు.