KMR: పిట్లం మండల శివారులోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం ఓ భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. రహదారి దాటుతున్న క్రమంలో దాన్ని గమనించిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరగకుండా అటుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు కాసేపు తమ వాహనాలను నిలిపివేశారు. కొండ చిలువ నెమ్మదిగా రహదారి దాటి సమీపంలోని పొలాల్లోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
జాతీయ రహదారిపై కొండ చిలువ!


