హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల 17 లోపు రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలి'

PDPL: పాలకుర్తి మండలంలో ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వే 20 శాతం పూర్తయిందని వ్యవసాయాధికారి బండి ప్రమోద్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం కుక్కలగూడూరు గ్రామంలో పంట నమోదు ప్రక్రియ చేపట్టారు. ఏడు రకాల సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు. రైతులందరూ ఈ నెల 17 లోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.