హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NRML: నిర్మల్‌ పట్టణ విద్యుత్‌ ఉపకేంద్రం పరిధిలో శనివారం మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం. 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాగులవాడ, మోతీనగర్, వాల్మీకినగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే చింతకుంటవాడ, మదీనా హోటల్‌ వెనుక ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.