హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ దరఖాస్తు

KNR: గణేష్ నవరాత్రులు, నిమజ్జన వేడుకలను దృష్టిలో ఉంచుకుని మండపాల నిర్వాహకులు ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో మండపానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా, చూడాలన్నారు.