హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ వద్ద రైస్ మిల్లర్ల ధర్నా!

నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం శాంతియుత మహాధర్నా నిర్వహించారు. రైస్ డెలివరీ‌లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ 13 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు అందజేశారు.