హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

ATP: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు తెలిపారు. పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రాజీ కాదగిన కేసులను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎక్కువ కేసులను పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని న్యాయాధికారులకు సూచించారు.