హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోలార్ ప్రాజెక్టు భూములను పరిశీలించిన అధికారులు

SRPT: మునగాల మండల పరిధిలోని ఈదుల వాగుతండా గ్రామంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి భూములను, డీఆర్డీఏ పీడీ ఆర్. సన్యాసయ్య, అదనపు పీడీ సురేష్ శుక్రవారం పరిశీలించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ల్యాండ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు కరుణాకర్, నగేష్, సీసీ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.