హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సమస్యల పరిష్కారానికి హామీ: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణిని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ రైతులు, నాయకులు కలిశారు. తాగునీటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హెచ్‌ఎల్‌సీ అధికారులతో మాట్లాడి ఓఅండ్ఎమ్ పనుల పురోగతి, నీటి పారుదల, విద్యుత్ సరఫరా వివరాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.