ASR: మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డీ.రాధామాధవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పీడీగా పనిచేసిన సూర్యలక్ష్మి జిల్లాకి బదిలీ కావడంతో పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జీకేవీధి సీడీపీవో ఝాన్సీబాయికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా బాపట్ల జిల్లా ఐసీడీఎస్ పీడీగా పనిచేస్తున్న రాధామాధవిని జిల్లాకు బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీగా రాధామాధవి


